జిల్లా కేంద్రంలోని వైద్యనాత్ కాలనీలో శ్రీ సింహాసనేశ్వరి దుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమాత అమ్మవారిని గాయత్రి మాత అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ సింహాసనేశ్వరి దుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజైన ఈరోజు దుర్గమాత అమ్మవారిని గాయత్రి మాత అవతారంలో అలంకరించి, ప్రత్యేక పూజలు చేసి, దూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అమ్మవారిని గాయత్రి దేవి అలంకారంలో దర్శించుకుని పూజించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కాలనీవాసులందరూ కలిసి పూజించుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింహాసనేశ్వరి దుర్గా మాత ఉత్సవ సమితి సభ్యులు సుధీర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, విష్ణు, మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

