శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ న తిరుమలలో జరగనుంది. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ, ఆర్టీసీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుని ఈ ఏర్పాట్లు చేశారు.
భక్తులు, వాహనదారుల సౌలభ్యం కోసం తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించి, భక్తులు ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకునేలా సూచనలు జారీ చేశారు. ప్రైవేటు వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులలో తిరుమలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరేలా ఆర్టీసీ సహకారంతో ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి పార్కింగ్ ప్రదేశాలపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా, ఫ్లెక్సీల ద్వారా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారాన్ని అందిస్తున్నారు.












