భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు మండలంలో గురువారం పర్యటించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం 22 మంది లబ్ధిదారులకు రూ.22,02,552 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, వాజేడు, అక్టోబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు మండలంలో గురువారం పర్యటించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అనంతరం వాజేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద 22 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.22,02,552 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అధికారులకు సూచనలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యే సూచించారు.

