జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అమల్లోకి వచ్చే నిబంధనలను అందరూ గౌరవించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు సూచనలు జారీ చేశారు.
జిల్లాలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వంటి కీలక దశలు కొనసాగుతున్నాయని, తదుపరి ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా, ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర దశల్లోనూ ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో రాజకీయ తటస్థతను , రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల సిబ్బంది రాజకీయంగా పూర్తి తటస్థతను పాటించాలి. ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడం, ఓట్లు అభ్యర్థించడం, రాజకీయ సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రచారం చేసే పోస్టులు పెట్టడం, వాటిని పంచుకోవడం, ఇష్టపడినట్లు గుర్తించడం, వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు చేపట్టకూడదని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ వాహనాలు, నిధులు, కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ అతిథి గృహాలు, ఇతర ప్రభుత్వ వనరులను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని సూచించారు. ప్రభుత్వ నిధులతో అధికార పార్టీ విజయాలు, పథకాలను ప్రచారం చేసే ప్రకటనలు జారీ చేయరాదని సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కొత్త ఆర్థిక ప్రయోజనాలు ప్రకటించడం, కొత్త పథకాలు ప్రారంభించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిర్వహణకు ప్రభుత్వ అధికారులు సహకరించరాదని సూచించారు. మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో ముడిపెట్టినప్పుడు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వారికి సహకరించరాదని సూచించారు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన అనుమతులు పొందిన తరువాతే చర్యలు చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సెలవులు మంజూరు చేయరాదని సూచించారు. ఎన్నికల సమయంలో నగదు, బంగారం, వెండి, బహుమతి వస్తువులు తదితరాలను అనుమానాస్పదంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత పరిమితులకు మించి నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సిన సందర్భాల్లో సంబంధిత ఆధారాలు వెంట ఉంచుకోవాలి. ఎన్నికల నిఘా బృందాలు తనిఖీలు నిర్వహించినప్పుడు అవసరమైన వివరాలు, పత్రాలను అందించి సహకరించాలని సూచించారు.

