రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, పుల్లపుతూరు గ్రామానికి చెందిన రాఘవ, అతిరాల గ్రామానికి చెందిన లక్ష్మి వివాహానికి ఉచితంగా తాళిబొట్టును అందజేశారు.
ఆకేపాటి ఎస్టేట్ నుండి పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుధాకర్ కుమారుడు రాఘవ, గంగయ్య, పెంచలమ్మ కుమార్తె లక్ష్మిలకు తాళిబొట్టును బహుమతిగా అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎమ్మెల్యే సతీమణి ఆకేపాటి జ్యోతి చేతుల మీదుగా తాళిబొట్టు
ఆకేపాటి ఎస్టేట్‌లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆకేపాటి జ్యోతి పాల్గొన్నారు. ఆమె వధూవరులను ఆశీర్వదించి, తాళిబొట్టును అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పేదింటి పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకుని వెంటనే స్పందించిన ఆకేపాటి కుటుంబం తాళిబొట్టు సహాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా, ఎమ్మెల్యేగా పేదల సంక్షేమానికి ఆకేపాటి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

