జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో, కన్నాపూర్ తాండ నివాసి అయిన కాట్రోత్ మహిపాల్ (28) తన టీవీఎస్ బైక్‌పై అక్రమంగా సారాను తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. అతన్ని వెంటనే అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రెండున్నర లీటర్ల సారాను, టీవీఎస్ బైక్‌ను జప్తు చేశారు. అనంతరం నిందితుడిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎం. శంకర్, అమృత రెడ్డి, రాజు మరియు మహిళా కానిస్టేబుల్ శిరీష పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా పరిధిలో ఎవరైనా ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే వారి వాహనాలను జప్తు చేయడమే కాకుండా, స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేస్తామని, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించబడతాయని, జరిమానాలు చెల్లించని వారిని జైలు శిక్షకు గురిచేసేలా చర్యలు ఉంటాయని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి బి. ముకుంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాటుసారా, గంజాయి అక్రమ అమ్మకాలు, తయారీ, రవాణా వంటి వాటిపై సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా ఆయన ప్రజలకు తెలియజేశారు. అక్రమ కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి