మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు జిల్లా పోలీసు శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పీలేరు ఎస్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సదస్సును నిర్వహించారు.
జిల్లా పోలీసు శాఖ ఈగల్ సెల్, శక్తి టీమ్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టం, సేఫ్ జోన్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి తెలియజేశారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తోటి విద్యార్థులను కూడా చైతన్యపరచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎక్కడైనా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు జరిగితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు నిర్భయంగా సమాచారం అందించాలని అధికారులు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

