భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, అక్టోబర్, 29: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, అక్టోబర్, 29: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అలాగే, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.












