రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నాగలాపురం పట్టణం, వెస్ట్ కాలనీలో పోలీసు అధికారులు, సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతా భరోసా కల్పించారు. జిల్లాలోని ఇతర ఎన్నికల ప్రాంతాల్లోనూ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్‌లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లేదా ఇతరుల ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అసాంఘిక శక్తులకు హెచ్చరిక
ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులను పోలీసులు హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







