ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాలపై సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరింత బలపడి, ఎల్లుండి సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీని ప్రభావంతో రేపు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అధికారుల సూచనలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

