భారత తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి సమైక్య భారత నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శమన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ ఐక్యత పౌరుల బాధ్యత
దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, అంతర్గత భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా సోదరభావంతో మెలుగుతూ శాంతిభద్రతలు, సామాజిక సామరస్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల నిరంతర కృషి
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





