కడప, 10 November
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం.ఓబులేసు యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం.ఓబులేసు యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి వివిధ రూపాల్లో ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. 7 వేల కోట్ల రూపాయలకు పైగా ఇంజనీరింగ్, డిగ్రీ, గతంలో నిలిపివేసిన ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల ఫీజు బకాయిలు అలానే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

