జగదేవపూర్ (డాక్సిన్ టైమ్స్) నవంబర్ 10
యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ పల్లపు మహేందర్ (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెలవుపై స్వగ్రామానికి వచ్చిన అతను, వ్యక్తిగత పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన పల్లపు మహేందర్ (26) ఐదేళ్లుగా ఆర్మీలో జవాన్‌గా సేవలందిస్తున్నాడు. దసరా పండుగ కోసం 25 రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు.
సోమవారం వ్యక్తిగత పని ముగించుకుని బుల్లెట్‌పై తిరిగి వెళ్తుండగా, సిద్దిపేట జిల్లా మండలం పీర్లపల్లి చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాయపడిన మరో వ్యక్తి
మరో బైక్‌పై ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రామలింగం (26) కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, రామలింగం చికిత్స పొందుతున్నాడు.

