మానుగూరు, 10 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతానికి రైలు రవాణా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. కరోనా అనంతరం ప్రస్తుతం ఒకే ఒక్క రైలుకు పరిమితం కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 10:
భద్రాద్రి జిల్లా మణుగూరు బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతానికి రైలు రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్ల సర్వీసులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు. కరోనాకు ముందు నాలుగు రైళ్లతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న రైల్వే సౌకర్యం, కరోనా అనంతరం ఒకే ఒక్క రైలుకు పరిమితం కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రయాణికుల అసంతృప్తి
కరోనా సమయంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన రైల్వే శాఖ, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ నిలిపివేసిన రైళ్లను తిరిగి ప్రారంభించకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఒకవైపు సింగరేణి బొగ్గు గనులు, మరోవైపు భద్రాద్రి పవర్ ప్లాంట్, బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి కీలక ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.

