కడప, 10 November
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.ఆర్. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.ఆర్. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, స్థానిక ప్రజలతో సమావేశమై ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు, ఎన్నికల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

