బిహార్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగులు, యాజమాన్యం మధ్య నెలకొన్న రెండు పారిశ్రామిక వివాదాలకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జోక్యంతో పరిష్కారం లభించింది. ఈ ఒప్పందాల ద్వారా 10,900 మందికి పైగా ఉద్యోగులకు సుమారు రూ.77.69 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి. ఇందులో ఏటా పునరావృతమయ్యే ప్రయోజనాలు రూ.9.02 కోట్లుగా ఉన్నాయి.
అధికారులకు లబ్ధి
ఉద్యోగులు చాలాకాలంగా కోరుతున్న పనితీరు ఆధారిత ప్రోత్సాహకం, అదనపు బాధ్యతలు నిర్వహించినందుకు ఇచ్చే భత్యాలు, వేతనాల పెంపు, ప్రయాణ భత్యాల సవరణ, పదోన్నతులు, కారుణ్య నియామకాలు వంటి అంశాలను ఈ ఒప్పందంలో పరిష్కరించినట్లు కార్మిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయాలతో అర్హులైన ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెండో ఒప్పందం న బిహార్ గ్రామీణ బ్యాంకు వర్కర్స్ ఆర్గనైజేషన్, బ్యాంకు యాజమాన్యం మధ్య జరిగింది. దీని ద్వారా సుమారు 2,500 మంది ఉద్యోగులకు రూ.10.52 కోట్ల విలువైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో ఏటా అందే ప్రయోజనాల విలువ రూ.9.02 కోట్లుగా ఉంది.












