బజాజ్ ఫైనాన్స్ తన వ్యక్తిగత రుణాల గరిష్ఠ పరిమితిని రూ.55 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో అర్హత కలిగిన వినియోగదారులు గతంలో కంటే అధిక మొత్తంలో రుణం పొందే అవకాశం లభిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రస్తుతం రూ.40,000 నుంచి రూ.75 లక్షల వరకు పర్సనల్ లోన్లను అందిస్తోంది. అయితే, రుణం మంజూరు అనేది దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ లేదా వ్యాపార వివరాలు, ఇప్పటికే ఉన్న రుణాలు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రుణ వివరాలు
గరిష్ఠ రుణ పరిమితి రూ.75 లక్షలు కాగా, కనిష్ఠ రుణ మొత్తం రూ.40,000గా ఉంది. ఈ రుణాలకు సంవత్సరానికి 10 నుంచి 30.5 వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది. రుణాన్ని 12 నుంచి 108 నెలల కాలపరిమితిలో తిరిగి చెల్లించవచ్చు. సాధారణంగా 650 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ అవసరం.











