ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో పాఠశాల తరగతి గదిలో చైన్సాతో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని మధ్యాహ్నం 2:15 గంటలకు ఆయన కలవనున్నారు.
వైద్యులను కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకోనున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాఠశాలలో ఏం జరిగింది
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం తరగతులు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి చైన్సాతో తరగతి గదిలోకి ప్రవేశించి పదో తరగతి విద్యార్థినిపై దాడి చేశాడు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది.
తీవ్రంగా గాయపడిన గోపికకు తొలుత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ ద్వారా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

