జమ్మలమడుగు, 2024-06-28
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు పరిధిలోని చిన్నకొమెర్ల గ్రామంలో "ఆపరేషన్ వజ్ర ప్రహార్"లో భాగంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు డిఎస్పీ కె. వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో, జమ్మలమడుగు రూరల్ సీఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున తలమంచిపట్నం పరిధిలోని చిన్నకొమెర్ల గ్రామంలో "ఆపరేషన్ వజ్ర ప్రహార్"లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో వేటకొడవళ్లు, బాంబులు, నిషేధిత ఆయుధాల కొరకు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వాహనాల రికార్డులను పరిశీలించి, సరైన రికార్డులు లేని 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుండి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చి నివసించే వారి ఆధార్, ఇతర వివరాలను పోలీసులు ధ్రువీకరించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామస్థులు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా, ఆర్థికంగా ఎదిగి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు.












