Jangaon/Ghanpur (Station) (డాక్సిన్ టైమ్స్) జూన్ 28
జూలై 02న రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రుల పర్యటన కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జూలై 02న రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి సమీపంలో జరగనున్న బహిరంగ సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ సభ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, అయితే సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమీక్షలో, సభా ప్రాంగణం, వీఐపీ రాకపోకల మార్గాలు, హెలిప్యాడ్, వేదిక పరిసరాలు, పార్కింగ్, ప్రజల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, బందోబస్తు పాయింట్లు, అత్యవసర స్పందన వ్యవస్థలపై విస్తృతంగా చర్చించారు. భద్రతా లోపాలకు తావులేకుండా సెక్యూరిటీ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.











