కడప, జూన్ 28
శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని ఎ.ఆర్ డిఎస్పి పి. నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు "సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని ఎ.ఆర్ డిఎస్పి పి. నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు "సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమాన్ని ఎ.ఆర్ డిఎస్పీ పి. నాగేశ్వర రావు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి, మహావీర్ సర్కిల్, డా. బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ బంగ్లా, కో ఆపరేటివ్ కాలనీ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా ఎ.ఆర్ డిఎస్పీ పి. నాగేశ్వర రావు మాట్లాడుతూ సైక్లింగ్ సహజసిద్ధమైన వ్యాయామమని తెలిపారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్ ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతకు సాయపడుతుందని తెలిపారు.












