అమెరికా న్యాయశాఖలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ హర్మీత్ కౌర్ ధిల్లాన్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా న్యాయశాఖ పౌర హక్కుల విభాగానికి అధిపతిగా ఉన్న ఆమె రాజీనామాను అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ ప్రకటించారు.
అమెరికా న్యాయశాఖలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ హర్మీత్ కౌర్ ధిల్లాన్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా న్యాయశాఖ పౌర హక్కుల విభాగానికి అధిపతిగా ఉన్న ఆమె రాజీనామాను అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ ప్రకటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మధ్యంతర ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన తొలి సీనియర్ అధికారిగా ఆమె నిలిచారు. చండీగఢ్‌లో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన హర్మీత్ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కోలో సొంత న్యాయ సంస్థను నిర్వహించిన ఆమె 2020లో అమెరికా న్యాయశాఖలో బాధ్యతలు చేపట్టారు. తన నిర్ణయం స్వచ్ఛందమైనదని, తిరిగి ప్రైవేటు న్యాయవాద వృత్తిలో కొనసాగాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

