ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ టూ ఫుట్‌బాల్ టోర్నీలో ఈస్ట్ బెంగాల్‌కు నిరాశ ఎదురైంది. ఇరాక్‌కు చెందిన అల్ షోర్టా జట్టుతో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 2-3 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. సొంత మైదానంలో జరిగిన ఈ పోరులో రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, కీలక అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోవడం ఆ జట్టుకు నష్టాన్ని కలిగించింది.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు డేవిడ్ లాల్హ్లాన్సంగా అద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో నిమిషంలో తొలి గోల్ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే 14వ నిమిషంలో అహ్మద్ యాహ్యా కార్నర్ నుంచి వచ్చిన బంతిని హెడర్‌తో గోల్‌గా మలచడంతో అల్ షోర్టా స్కోరును సమం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఈస్ట్ బెంగాల్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. డేనియల్ రామిరెజ్ ఫ్రీకిక్‌ను ప్రత్యర్థి గోల్‌కీపర్ అడ్డుకున్నప్పటికీ, తిరిగి వచ్చిన బంతిని బాసిమ్ రషీద్ అందించి సహకరించడంతో డేవిడ్ రెండో గోల్ సాధించాడు. దీంతో ఈస్ట్ బెంగాల్ 2-1 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.
రెండో అర్ధభాగంలో అల్ షోర్టా పుంజుకుంది
విరామం తర్వాత అల్ షోర్టా దూకుడు పెంచింది. 51వ నిమిషంలో హుస్సేన్ అల్ సయీది గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. మరో రెండు నిమిషాలకే క్రిస్టియన్ బార్కో అందించిన కార్నర్‌ను కింగ్స్లీ కుకు హెడర్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో అల్ షోర్టా 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!





