టర్కీలోని ఇస్తాంబుల్‌లో పెళ్లి ఫొటోషూట్ సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. భారీ బెలూన్ల బొకేను పట్టుకున్న వధువు, బలమైన గాలికి దాదాపు గాల్లోకి ఎగిరిపోయినంత పనైంది. అయితే, ఫొటోగ్రాఫర్ సమయస్ఫూర్తితో ఆమెను కాపాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పెళ్లి ఫొటోషూట్‌లో వినూత్నంగా కనిపించాలనే ఆలోచన ఒక్కోసారి ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారీ బెలూన్లతో తయారు చేసిన పూల బొకేను పట్టుకున్న వధువు, గాలి బలంగా వీయడంతో దాదాపు గాల్లోకి ఎగిరిపోయినంత పనైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫొటోషూట్ జరిగిన ప్రదేశం టర్కీలోని ఇస్తాంబుల్ నగరం. బోస్ఫరస్ జలసంధి సమీపంలో వధువు భారీ బెలూన్ల బొకేతో ఫొటోలు దిగుతుండగా, ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. బెలూన్లు గాలికి పైకి లాగడంతో వధువు తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. గాలి ఆమెను సమీపంలోని సముద్రపు గోడ వైపు లాగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది.












