పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, రక్షణ రంగంలో కొత్త పరిణామాలు, విమానయాన రంగానికి సంబంధించిన వార్తలు పరీక్షల్లో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. నాటి ముఖ్యమైన అంశాలు ఇవి.
అజర్బైజాన్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటన
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న అజర్బైజాన్ రాజధాని బాకూలో పర్యటించారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత విదేశాంగ మంత్రి ఈ దేశంలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్, విదేశాంగ మంత్రి జెహున్ బైరామోవ్తో ఆయన సమావేశమయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత్, అజర్బైజాన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రవాణా అనుసంధానం, పర్యాటకం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. అంతర్జాతీయ ఉత్తరదక్షిణ రవాణా కారిడార్ ద్వారా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంపైనా ఇరు దేశాలు దృష్టి సారించాయి. గతంలో ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.












