పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ప్రముఖ టీవీ యాంకర్ రబియా అహ్సన్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం గుల్షనాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆమె తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఈ కేసులో పోలీసులు ఆమె భర్త అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రబియా అహ్సన్ తన బెడ్రూమ్లో తుపాకీ గాయంతో కనిపించారు. ఆమె మెడ కింది భాగంలో బుల్లెట్ గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో కాల్పులకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భర్త వాదన.. పోలీసుల విచారణ
పోలీసుల ప్రాథమిక విచారణలో, రబియా భర్త అహ్మద్ తాను తుపాకీతో ఆడుకుంటుండగా అనుకోకుండా బుల్లెట్ పేలిందని, అది తన భార్యకు తగిలిందని వాదించారు. అయితే, ఈ వాదనను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన కాల్పులా లేక ఉద్దేశపూర్వక హత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.





