బాలీవుడ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫ్రాంచైజీ ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్ పేరుతో వెబ్ సిరీస్‌గా వస్తోంది. ప్రేమకథలు, కాలేజీ సరదాలకు భిన్నంగా హత్య మిస్టరీ, రహస్యాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ సిరీస్ రూపొందింది. ప్రముఖ నటి షనాయా కపూర్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. న చిత్రబృందం అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. రీమా మాయా దర్శకత్వం వహించగా, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కథాంశం
గతంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాల్లోని సెయింట్ తెరెసా పాఠశాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈసారి అక్కడి విద్యార్థిని ఆయేషా మాలిక్ అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని అధికారులు భావిస్తున్నా, ఆమె కవల సోదరి అదితి మాత్రం అది ప్రమాదం కాదని అనుమానిస్తుంది.
తన సోదరి మరణం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి అదితి అదే పాఠశాలలో మరో గుర్తింపుతో చేరుతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పోటీలో పాల్గొంటూ, తన సోదరి స్నేహితులే ఆమెకు ప్రత్యర్థులని, వారిలో ఒక్కొక్కరికి ఏదో ఒక రహస్యం ఉందని తెలుసుకుంటుంది. ఆయేషా మరణానికి కారణం ఎవరు ఈ పోటీ వెనుక ఉన్న రహస్యమేంటి అనేది ఆసక్తికరంగా మారుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







