రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేస్తుంది.
రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు విధించడం, వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పరిధిలో ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం జీవో 135 జారీచేసింది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.
రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

