ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై చైనా గూఢచర్య ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది.
అసలు వివాదం ఏమిటంటే.. ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళతో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె చైనా నిఘా వ్యవస్థకు సమాచారం అందించిందని గతంలో వార్తలు వచ్చాయి. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో పనిచేసిన మాజీ ఎగ్జిక్యూటివ్‌గా గుర్తించారు. ఈ సంస్థ ఎన్విడియా ఏఐ చిప్‌ల కొనుగోలుదారుల్లో ఒకటి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చైనాకు వెళ్లకూడని అత్యాధునిక చిప్‌లను అక్కడికి చేరవేసే ప్రయత్నాలపై కూడా అమెరికా అధికారులు నిఘా పెట్టారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అమెరికా జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్యాలకు నష్టం జరిగిందని భావించడానికి ప్రస్తుతం తమ వద్ద ఆధారాలు లేవని ఎన్విడియా తెలిపింది. అయినప్పటికీ అన్ని అంశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు జెన్సన్ హువాంగ్ తన ఉద్యోగులకు పంపిన సందేశంలో భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పారు. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని, అందుకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యక్తిగత సంబంధం గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలను నిరూపించదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

