ప్రముఖ కళాకారుడు గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, FDC చైర్మన్ దిల్ రాజులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గద్దర్ కళాసేవలను పలువురు స్మరించుకున్నారు. ఆయన స్ఫూర్తితో యువతరం కళాకారులు ముందుకు రావాలని, సినీ పరిశ్రమకు కొత్త ఉత్తేజాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సంస్థ, కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అవార్డులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందజేయబడతాయి.











