హైదరాబాద్‌లోని జియాగూడలో అపరిశుభ్ర పరిస్థితుల్లో, అనుమతులు లేకుండా భారీ ఎత్తున సమోసాలు తయారు చేస్తున్న ఒక యూనిట్‌పై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) మరియు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.5 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ సమోసా తయారీ కేంద్రం, ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దాడుల్లో వెల్లడైంది. విచారణలో అధికారులు కల్తీ ఆహార తయారీ విధానాలను గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దాదాపు రూ.5 లక్షల విలువైన కల్తీ సమోసాలు, వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు.











