జమ్మలమడుగు, 01
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జులై 3, 2026న జమ్మలమడుగులోని జెఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జులై 3, 2026న శుక్రవారం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జెఎస్ డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను పరిశీలించడానికి విచ్చేస్తున్న సందర్భంగా, భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్ లో సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, బిర్రు గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.











