కామారెడ్డి, 2026-08-09
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఈ సందర్భంగా బంగారు మైసమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
బంగారు మైసమ్మ ఆలయంలో సందడి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కొలువైన బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మహిళలు తమ ఇళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన పెట్టుకుని, ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు, ఒడి బియ్యం పోసి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థించారు.







