కృత్రిమ మేధ () రంగంలో మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా విస్తరిస్తుండటంతో, అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలపై రుణ భారం పెరుగుతోంది. , , , , , , సంస్థలతో కూడిన మాగ్నిఫిసెంట్ సెవెన్ కంపెనీల మొత్తం అప్పులు 2026 మధ్య నాటికి 45 శాతం పెరిగి 578 బిలియన్ డాలర్లకు చేరనున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడు సంస్థల మొత్తం అప్పులు 2025లో సుమారు 399 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 మధ్య నాటికి 578 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి. 2023లో ఉన్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 1.7 రెట్లు అధికంగా ఉంటాయని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏఐ డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యం, ఇతర సాంకేతిక మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఈ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. వీటితో పాటు, బ్యాలెన్స్ షీట్లలో నేరుగా కనిపించని కొనుగోళ్లు, పెట్టుబడులకు సంబంధించిన భవిష్యత్తు చెల్లింపు బాధ్యతలు కూడా గణనీయంగా పెరుగుతాయని నివేదిక పేర్కొంది.
వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ విలువపై ప్రభావం
అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు, రుణాలపై వడ్డీ ఖర్చులు పెరిగితే ఈ టెక్నాలజీ సంస్థల భవిష్యత్తు ఆదాయాల విలువ తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ హెచ్చరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







