ఫ్రాన్స్‌లో జంతువులకు సోకే షమోండా వైరస్ తొలిసారిగా ఓ మనిషిలో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి అక్టోబర్ ప్రారంభంలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు ఆరోగ్యపరమైన ముప్పు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
వైరస్ సోకిన వ్యక్తి అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన రోగనిరోధక వ్యవస్థ కూడా తీవ్రంగా బలహీనపడిందని అధికారులు తెలిపారు. ఈ అసాధారణ ఘటనపై వైద్య నిపుణులు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లియోన్‌లో రోగి మృతి
ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందుతున్న వ్యక్తిలో షమోండా వైరస్‌ను గుర్తించారు. ఆ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ బాగా బలహీనపడిన స్థితిలో ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. వైరస్ ఆయనకు ఎలా సోకింది మరణానికి వైరస్ కారణమైందా లేక అప్పటికే ఉన్న అనారోగ్యంతో పాటు వైరస్ కూడా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందా అనే అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.












