ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడంతోపాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం, క్షేత్రస్థాయి పాలనను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రెవెన్యూ, హౌసింగ్, భూ సర్వే శాఖలకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకునే ఉద్దేశంతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇందులో భాగంగా బుధవారం మేడ్చల్మల్కాజిగిరి జిల్లా పరిధిలోని షామీర్‌పేటలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇన్చార్జి మంత్రులు హాజరుకానున్నారు.
రెవెన్యూ సమస్యలు, గృహ నిర్మాణ పథకాల అమలు, భూ సర్వే పురోగతితోపాటు ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించనున్నారు. గత ఏప్రిల్, మే నెలల్లో రాజధాని వేదికగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా శాఖల పనితీరు, సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

