రంగారెడ్డి, 24 జూన్ 2024
శంకర్పల్లి రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన సుధాకర్, అతని భార్య లక్ష్మి, మరికొందరు సహచరులు కలిసి 2021 నుంచి 2024 మధ్య కాలంలో చిట్‌ఫండ్ పథకం పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శంకర్పల్లి రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన సుధాకర్, అతని భార్య లక్ష్మి, మరికొందరు సహచరులు కలిసి 2021 నుంచి 2024 మధ్య కాలంలో చిట్‌ఫండ్ పథకం పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను బాధితుల నుంచి సేకరించినట్లు సమాచారం. అధిక వడ్డీ, మంచి రాబడి వస్తుందనే నమ్మకంతో పలువురు తమ పొదుపు మొత్తాలను ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ పథకం ద్వారా మొత్తం 48 మంది నుంచి రూ.3,62,41,000 వసూలైనట్లు నిర్ధారించారు. మొత్తం వసూళ్లు రూ.4 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఫిర్యాదుదారుల్లో ఒకరైన పర్సి అశ్విన్ కూడా ఆన్లైన్ లావాదేవీల ద్వారా రూ.6.60 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, 2024లో సుధాకర్ డబ్బులు తిరిగి చెల్లించకుండా అందుబాటులో లేకుండా పోయినట్లు బాధితులు ఆరోపించారు. పలుమార్లు సంప్రదించినా స్పందన లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుడైన సుధాకర్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

