తెలంగాణ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ 'టీ.జీ. ఫిట్‌కాప్' కార్యక్రమాన్ని అమలు చేయనుంది. సుమారు 90 వేల మంది పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం దీని లక్ష్యం.
డీజీపీ సీవీ ఆనంద్ యాప్ డెవలపర్లు, పోలీస్ సాంకేతిక విభాగం, ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చే పదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక స్పాన్సర్ ముందుకొచ్చినట్లు తెలిపారు. మరో 30 నుంచి 45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరోగ్య పరీక్షల వివరాలు
తొలి దశలో పోలీసు సిబ్బంది ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (), రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య అంశాలను నమోదు చేస్తారు. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, శారీరక శ్రమ వంటి వివరాలను కూడా యాప్‌లో పొందుపరుస్తారు.
నమోదైన వివరాల ఆధారంగా సిబ్బందిని తక్కువ, మధ్యస్థ, అధిక ఆరోగ్య ప్రమాద స్థాయులుగా విభజిస్తారు. అధిక ప్రమాదంలో ఉన్నవారికి ప్రత్యేక వైద్య సలహాలు అందించడంతో పాటు, కాల్‌సెంటర్ ద్వారా వైద్యులు సంప్రదించి అవసరమైన పరీక్షలు, చికిత్సకు మార్గనిర్దేశం చేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

