తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై డీఎంకే మహిళా కౌన్సిలర్ సుధా దీనదయాళన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కార్యక్రమ నిర్వాహకుడు మురళీధరన్పైనా కేసు నమోదైంది. చెన్నైలో జరిగిన డీఎంకే కార్యక్రమంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. చెన్నైలోని రాజా అన్నామలై మండ్రంలో డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుధా దీనదయాళన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రూపాన్ని విజయ్ విమర్శించారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతోనే విజయ్ అధికారంలోకి వచ్చారని కూడా ఆమె విమర్శించారు.
కేసు నమోదు వివరాలు
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) హార్బర్ ప్రాంత కార్యదర్శి ఉదయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చెన్నైలోని ఎస్ప్లనేడ్ పోలీసులు సుధా దీనదయాళన్, కార్యక్రమ నిర్వాహకుడు మురళీధరన్‌పై భారతీయ న్యాయ సంహితలోని 296(బి), 352, 353(1)(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఫిర్యాదుదారుడి ఆరోపణ. ఈ ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది.

