కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆయిల్ బాండ్ల చెల్లింపును ప్రస్తుత మోడీ ప్రభుత్వం మార్చి 2026 నాటికి పూర్తి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ఈ బాండ్ల కింద మొత్తం రూ. 2.92 లక్షల కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉందని, ఇది దశాబ్దానికి పైగా వారసత్వంగా వచ్చిన ఆర్థిక భారం అని ఆమె అభివర్ణించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అదనపు గ్రాంట్ల డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో చమురు కంపెనీలకు రూ. 1.48 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను జారీ చేసిందని, ఈ బాండ్లపై 7 నుంచి 8.4 శాతం వడ్డీ ఉందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
"వాస్తవానికి, ఈ నెలలోనే యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆయిల్ బాండ్లను మేము క్లియర్ చేయబోతున్నాము," అని సీతారామన్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై నగదు రాయితీలకు బదులుగా ఈ బాండ్లను జారీ చేశారు. దీనితో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక భారం తొలగిపోతుందని ఆమె పేర్కొన్నారు.










