కడప జిల్లా నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపునకు మద్దతుగా భారీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాగిరెడ్డిపల్లె-1 ఎంపీటీసీ అభ్యర్థి యలమూరి సునందా, నాగిరెడ్డిపల్లె-2 ఎంపీటీసీ అభ్యర్థి మాడపూరి శ్రీవాణి, జెడ్పీటీసీ అభ్యర్థి చిర్లు పెంచలమ్మ తరపున ప్రచారం సాగింది.
పల్లె గ్రీష్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారానికి ఊతమిచ్చారు. రాష్ట్ర నాయకులు గోపీనాథ్ యాదవ్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మధు యాదవ్, కలిముల్లా ఖాన్, శ్రీధర్ గౌడ్, పుత్తా శంకర్, నందు రెడ్డి, డిష్ పెంచలయ్య, పణతల గంగయ్య, ఏలుమలై, మోషే, పెంచలయ్య, రషీద్, అరవింద్, షఫీ, ముబారక్, రాంప్రసాద్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

