బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నరిగళ్ల రాజును నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి మద్దతు తెలిపారు.
బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, జిల్లా ఇన్చార్జి మంతెన సామిల్ మాదిగ సూచన మేరకు గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బానపురం లావణ్య నేతృత్వంలో ఈ ఎన్నిక జరిగింది.
నూతన కమిటీ అధ్యక్షుడిగా నరిగళ్ల రాజు, అధికార ప్రతినిధిగా భాను, ప్రధాన కార్యదర్శులుగా బర్కరం రామ్, నరిగండ్ల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కోటికల్లా రాజయ్య, ఇల్లందుల గణేష్, ఇల్లందుల రవి, ఇల్లందుల సురేష్ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కార్యదర్శులుగా రజనీకాంత్, భరత్, భీమయ్య, దేవయ్య, సహాయ కార్యదర్శులుగా ఇల్లందుల ప్రేమ్ కుమార్, శ్యామకుర్తి గంగాధర్, ఇల్లందుల అనిల్, బర్కరం నారాయణ, రాజయ్య, సామకుర్తి మసూద్లను ఎన్నుకున్నారు.

