ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 3,875 డాలర్లకు చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.4,347 తగ్గి రూ.1,38,419కు చేరింది. ఈ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అవసరమైతే డిసెంబర్లో వడ్డీ రేట్లు పెంచవచ్చనే సంకేతాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం కంటే వడ్డీ వచ్చే బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. 2. ముడి చమురు ధరల పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
3. అమెరికా డాలర్ బలోపేతం: అమెరికా డాలర్ బలపడటంతో ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేసే వారికి ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది. 4. స్టాక్ మార్కెట్లలో నష్టాలు.. పెట్టుబడుల ఉపసంహరణ: ఏఐ () రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్లలో నష్టపోయిన కొందరు ఇన్వెస్టర్లు నగదు సమకూర్చుకునేందుకు బంగారం వంటి ఇతర ఆస్తులను కూడా విక్రయించినట్లు మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.
5. భారీ లాభాల స్వీకరణ: ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కొందరు ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు బంగారాన్ని అమ్ముతున్నారు. ఈ అమ్మకాల ఒత్తిడి ధరల పతనానికి మరో కారణంగా మారింది. 2024లో బంగారం, వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయులకు చేరాయి. అప్పటి నుంచి భారీగా తగ్గాయి. బంగారం: జనవరిలో నమోదైన గరిష్ఠ ధర రూ.1,80,779 నుంచి రూ.42,366 తగ్గింది. వెండి: జనవరిలో నమోదైన గరిష్ఠ ధర కిలోకు రూ.4,20,048 నుంచి 50 శాతానికి పైగా పడిపోయింది.

