కడప జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులను పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి వరకు అనుమతించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సరైన అనుమతులు లేని యూట్యూబ్, పీడీఎఫ్ రిపోర్టర్లను అనుమతించరాదని స్పష్టం చేశారు.
కడప నగరంతో జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా ఆర్ట్స్ కళాశాలలో ఏర్ చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించి, పోలీసు సిబ్బందితో మాట్లాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్రిడిటేషన్ కార్డుల ప్రాముఖ్యత
కలెక్టర్ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులకు మాత్రమే నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతి కల్పించాలని ఆయన సూచించారు. యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు, పీడీఎఫ్ పేపర్ల రిపోర్టర్లు సరైన అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు రావడానికి వీలులేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు.

