కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు. కడప నగరంలో 361 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వీటిలో 16 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
కడప ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ తీరును సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ భద్రతపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అదనపు బలగాలతో బందోబస్తు
కడప, పులివెందుల ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కడప నగరంలో మొత్తం 361 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, 42 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప నగరంలోనే వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.







