ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో ఆయన బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
రాయచోటి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను మంత్రి స్వయంగా కలిసి వారి సమస్యలు, విజ్ఞప్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని సూచించారు.
ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

