ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు, 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని సంఘం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించింది. ఇందులో టీడీపీ 19,760, వైసీపీ 17,726, జనసేన 4,330, బీజేపీ 1,049, స్వతంత్రులు 2,012 మంది ఉన్నారు.
జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న 659 స్థానాలకు గాను 4,770 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చింది. ఇందులో టీడీపీ 1,693, వైసీపీ 1,445, జనసేన 587, బీజేపీ 227, స్వతంత్రులు 227 మంది ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

