జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల్లో భద్రతా భావాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసుల కవాతు నిర్వహించారు. పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో ఈ కవాతు జరిగింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల్లో భద్రతా భావాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసుల కవాతు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహించి ఎన్నికల భద్రతపై ప్రజలకు భరోసా కల్పించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

