ఢిల్లీలో ఓటర్ల జాబితా సవరణపై నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను చట్టవిరుద్ధంగా నిర్బంధించకూడదని, ఎవరినైనా అదుపులోకి తీసుకోవాల్సి వస్తే చట్ట ప్రకారం నిర్దేశించిన విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, ఇంటర్నెట్ సేవలకు అనవసర అంతరాయాలు కలిగించవద్దని ఆదేశించింది.
ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను చట్టవిరుద్ధంగా నిర్బంధించకూడదని అధికారులను ఆదేశించింది. ఎవరినైనా అదుపులోకి తీసుకోవాల్సి వస్తే చట్ట ప్రకారం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టిన జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషన్ పనితీరుపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
మెట్రో, రైలు సేవలకు అంతరాయం వద్దు
నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో, రైలు రవాణాపై విధించిన ఆంక్షలను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. శాంతిభద్రతలకు అవసరమైన పరిమితులు మినహా ప్రజా రవాణా సేవలను సాధారణంగా కొనసాగించాలని సూచించింది. ఇంటర్నెట్ సేవలకు కూడా చట్టబద్ధమైన కారణాలు లేకుండా అంతరాయం కలిగించకూడదని పేర్కొంది. నిరసనల సమయంలో ఢిల్లీలోని 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణలను నిలిపివేశారని పిటిషనర్లు ఆరోపించారు. రైలు సేవలకు అంతరాయం కలిగించడంతో పాటు, ఢిల్లీకి చేరుకునే వారిని అడ్డుకున్నారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

