హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు కంటి గాయాలపాలయ్యారు. మెహిదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి మొత్తం 32 మంది బాధితులు చికిత్స కోసం వచ్చినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. వీరిలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు కంటి గాయాలపాలయ్యారు. మెహిదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి మొత్తం 32 మంది బాధితులు చికిత్స కోసం వచ్చినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆసుపత్రిలో చేరిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 26 మందికి మందులు ఇచ్చి, తదుపరి పరీక్షలు, చికిత్స కోసం తిరిగి రావాలని వైద్యులు సూచించారు.
ఒకరి చూపు పూర్తిగా పోయింది
ఈ ఘటనల్లో ఒక వ్యక్తి కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. టపాసుల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు, పేలుడు సమయంలో వెలువడిన శకలాలు కళ్లకు తగలడంతో ఈ గాయాలైనట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

